మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి

MIRCHI
రెబల్ తరువాత ప్రభాస్ చేస్తున్న మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. వచ్చే వారంలో సెన్సార్ పూర్తి చేసి ఫిబ్రవరి 8న భారీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారి కొరటాల శివ చేస్తున్న మొదటి చిత్రం ఇది. మిర్చి పై చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్న చిత్ర బృందం సోమవారం నుండి ప్రమోషన్ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. ప్రభాస్ జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశి కృష్ణ రెడ్డి కలిసి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

Exit mobile version