ఒంగోలు గిత్త చిత్రానికి “A” రావడానికి గల కారణం ఇదే

prakash-raj
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ హీరోగా రానున్న “ఒంగోలు గిత్త” ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి “A” సర్టిఫికేట్ ఇచ్చారు. భాస్కర్ చిత్రానికి “A” సర్టిఫికేట్ రావడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యపరిచే విషయం వెల్లడయ్యింది. ఈ చిత్రంలో రెండు సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ నగ్నంగా కనిపించనున్నారు. ఈ సన్నివేశాలను బ్లర్ చేసినా కూడా సెన్సార్ బోర్డ్ “A” సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని పాత్ర బాగా నచ్చడంతో ప్రకాష్ రాజ్ ఇలా నటించేందుకు అడ్డుచెప్పనట్లు తెలుస్తుంది. అదండీ “ఒంగోలు గిత్త” చిత్రానికి “A” సర్టిఫికేట్ రావడానికి వెనుక ఉన్న బలమయిన కారణం.

Exit mobile version