మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్లో అడుగుపెడుతున్న సినిమా ‘జంజీర్’. ఈ సినిమా 1973లో అమితాబ్ బచ్చన్ హీరోగా చేసిన ‘జంజీర్’ సినిమాకి రీమేక్. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో షేర్ ఖాన్ పాత్రని సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ సంవత్సరం జరగనున్న సిసిఎల్ క్రికెట్ మ్యాచ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఫిబ్రవరి 18న తెలుగు వారియర్స్ – ముంబై వారియర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సారి తెలుగు వారియర్స్ తరపున రామ్ చరణ్ కూడా బరిలో దిగనున్నాడు.
కావున ఇక్కడ రిలీజ్ చేస్తే అటు హిందీ, ఇటు తెలుగు అందరికీ రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. అపూర్వ లిఖియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబందించిన పనులు డైరెక్టర్ యోగి చూసుకుంటున్నాడు. ఏప్రిల్ 12న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాని ఒకేసారి హిందీ, తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.