నిరుత్సాహానికి గురైన సమంత.!

Samantha

ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ డిమాడ్ ఉన్న హాట్ హీరోయిన్ సమంత. ఈ అందాల భామ వరుస విజయాల ట్రాక్ రికార్డ్ తో బాక్స్ ఆఫీసు వద్ద పర్ఫెక్ట్ స్ట్రైక్ రేట్ సంపాదించుకుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే సమంత కాస్త నిరుత్సాహానికి గురైంది. సమంత ఈ రోజు తన ట్విట్టర్లో ఆసక్తికరమైన ఓ కామెంట్ చేసారు.

‘నాకు ఒక చాలెంజింగ్ పాత్ర రావాలని కోరుకుంటున్నాను. ఆ పాత్ర సింపుల్ క్యూట్ గా ఉండకూడదు, ఇదివరకు లాగా సేఫ్ గా కూడా ఉండే పాత్ర కాకూడదు. ఇప్పుడు చేస్తున్న పాత్రలకి పూర్తి భిన్నంగా ఉండాలి. రోటీన్ కి కొంచెం భిన్నంగా అలోచిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దని’ సమంత ట్వీట్ చేసింది.

చూస్తుంటే సమంత హీరోయిన్ గా ప్రస్తుతం చేస్తున్న పాత్రల విషయంలో అంత సంతృప్తికరంగా లేనట్టు అనిపిస్తోంది. చాలా కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో హీరోయిన్స్ నటనకి పెద్దగా ఆస్కారం ఉండదు, అలాగే వాళ్ళు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. సమంత మాత్రం టాలెంట్ ఉన్న హీరోయిన్. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘ఈగ’ సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఫిలిం మేకర్స్ ఆమె కోరిక వినాలని, అలాగే ఆమె కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.

Exit mobile version