సాయి రామ్ శంకర్ “దిల్ ఉన్నోడు”

Sairam-Shankar
సాయిరాం శంకర్ త్వరలో “దిల్ ఉన్నోడు” అనే చిత్రంలో కనిపించనున్నారు. గతంలో “బంపర్ ఆఫర్” చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జాస్మిన్ మరియు ప్రియదర్శిని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ మీద కె వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం బ్యాంకాక్ పయనం అవ్వనున్నారు. మిగిలిన పాటలను హైదరాబాద్ లోనే చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం కాకుండా సాయి రామ్ శంకర్ తేజ దర్శకత్వంలో రానున్న “వెయ్యి అబద్దాలు” అనే చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version