మళ్ళీ తెరపై మెరవనున్న రాశి

Raasi

1990ల్లో ఫుల్ క్రేజ్ మీదున్న హీరోయిన్స్ లో రాశి కూడా ఒకరు. ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, శ్రీ కాంత్, జగపతి బాబు మొదలైన హీరోల సరసన నటించింది. ఫాంలో ఉన్నప్పుడే రాశి పెళ్లి చేసుకొని ఇల్లాలిగా సెటిల్ అయ్యింది. చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాశి మొదట బుల్లితెరపై కనిపించి సందడి చేసింది.

తాజా సమాచారం ప్రకారం రాశి కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించనుంది. మీకు పైన అందించిన ఫోటోలో స్లిమ్ గా తయారైన రాశిని చూడవచ్చు. సెకండాఫ్ లో తెరమీద కనిపించడమే కాకుండా తన గాత్రాన్ని కూడా అరువు ఇవ్వనుంది. ప్రభాస్ హీరోగా వస్తున్న ‘మిర్చి’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నదియా పాత్రకి రాశి డబ్బింగ్ చెప్పనుంది. సెకండ్ ఇన్నింగ్స్ ని మొదట వాయిస్ తో ప్రారంభిస్తున్న రాశి ముందులాగే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవాలని కోరుకుందాం.

Exit mobile version