ఫిబ్రవరి 1న జబర్దస్త్ ఆడియో విడుదల

Jabardasth

సిద్ధార్థ్, సమంత జంటగా నటించిన జబర్దస్త్ చిత్ర ఆడియో జనవరి 27న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న తాజ్ డెక్కన్ హోటల్లో జబర్దస్త్ చిత్ర ఆడియో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి ప్రకటించారు. అందరూ ఈ చిత్రానికి జబర్దస్త్ టైటిల్ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. మా సినిమాలో ఫుల్ జోష్, ఎనర్జీ ఉంటుంది. సో దానికి తగ్గట్లుగా టైటిల్ పెట్టలనుకున్నపుడు జబర్దస్త్ అయితే బావుంటుందని ఇది పెట్టాం. సిద్ధార్థ్ ఇందులో బైర్రాజు అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. సమంత ఇప్పటి వరకు చేసిన పాత్రలకి ఇందులో పాత్రకి పూర్తి భిన్నం. శ్రేయ అనే మాస్ పాత్ర చేస్తుంది. శ్రీహరి ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. సెన్సార్ కూడా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు.

Exit mobile version