యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్ షా’ సినిమా రైట్స్ గుంటూరు ఏరియాలో రికార్డ్ మొత్తానికి అమ్ముడుపోయాయి. మాకు అందిన సమాచారం ప్రకారం సుమారు 4 కోట్ల రూపాయలకి రైట్స్ అమ్మారు. గుంటూరులో ఇంత పెద్ద మొతానికి అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండడంతో అన్ని ఎరియాల్లోనూ బిజినెస్ బాగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటివరకూ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాలు అందుకున్న శ్రీను వైట్ల ఈ సినిమాకి డైరెక్టర్. సాలిడ్ కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో పేరున్న గోపి మోహన్, కోనా వెంకట్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ‘బాద్ షా’ కూడా అదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.