‘దూకుడు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీనువైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకి టైటిల్ ‘ఆగడు’. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపిచంద, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్న సొనమ్ కపూర్ ని హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఆమె తెలుగులో సినిమా చేయలేదు, కానీ మొదటి సినిమా మహేష్ బాబుతో చేయనుంది అనగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది.
సొనమ్ ఫాన్స్ ఈ సినిమా గురించి ట్వి ట్ట ర్లో అడిగితే ఆ వార్తలని ఆమె ఖండించింది, అలాగే మహేష్ బాబు సినిమాకి సైన్ చెయ్యలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా వంశీ పైడిపల్లి, క్రిష్ సినిమాలు క్యూలో ఉన్నాయి.