ఎన్టీఆర్ చిత్రాల పేర్లతో తారకరత్న చిత్రంలో పాట

eduruleni-alexanderనటుడు తారక రత్న మరియు కోమల్ ఝ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఎదురులేని అలెగ్జాండర్”. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రాజా రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా పోచ లక్ష్మి కాంత రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో ఒక పాటను రాజు నృత్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమయిన విషయం ఏంటంటే ఈ పాట మొత్తం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాల పేర్లతో రాయడం. ఇక్కడ జరిగిన పత్రిక సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ “ఇలాంటి ఒక పాట నా చిత్రంలో ఉండటం చాల ఆనందంగా ఉంది ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ” అని అన్నారు. ఈ చిత్రానికి జోస్యభట్ల శర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తారక రత్న “విజేత” చిత్ర ఆడియో ఇటీవల విడుదల అయ్యింది. ఈ రెండు చిత్రాలు కాకుండా ప్రస్తుతం తారక రత్న “మహాభక్త సిరియాలి” , “నేను చాల వరస్ట్” మరియు “చూడాలని చెప్పాలని” చిత్రాలలో నటిస్తున్నారు.

Exit mobile version