చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజను తెరకు పరిచయం చేస్తూ వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రానున్న చిత్రం “రేయ్”. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెండు పాటలు ఒక ఫైట్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. “రేయ్” చిత్రం అమెరికా, వెస్ట్ఇండీస్ మరియు బ్యాంకాక్ లలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రంలో శ్రద్దాదాస్ మరియు సయామీ ఖేర్ కథానాయికగా కనిపించనుంది. యలమంచలి గీత సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు బ్యానర్ మీద వై వి ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.