మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ మంచు నిర్మాతగా నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి’. నాలుగు నెలలుగా ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికి ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 21న భారీగా రిలీజ్ చేయనున్నారు. అలాగే తమిళ వెర్షన్ ని ఒక రోజు ఆలస్యంగా ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని 1986 లో జరిగిన గోదావరి వరదల నేపధ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలోని వరదలను షూట్ చేయడం కోసం భారీ సెట్స్ ని కూడా వేశారు. కుమార్ నాగేందర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.