విశాల్, త్రిష, సునయన ప్రధాన పాత్రల్లో నటించిన వేటాడు వెంటాడు చిత్రం ఈ రోజే విడుదల కాబోతుంది. తమిళ్ సమర్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ రెండు వారాల క్రితమే విడుదలైంది. గతంలో విశాల తో కిలాడి అనే సినిమా డైరెక్ట్ చేసిన తిరు ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేసాడు. విశాల్ రెండు విభిన్నమైనపాత్రల్లో కనిపించగా మనోజ్ బాజ్పాయ్, జె.డి చక్రవర్తి విలన్ పాత్రల్లో కనిపిస్తారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా దిన నేపధ్య సంగీతం అందించాడు. సమర్ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మించగా తెలుగులో దామెర శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు.