ఈవివి సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన “ఆ ఒక్కటే అడక్కు” చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. ఈ చిత్రం ద్వారా రంభ తెరకు పరిచయం అయ్యింది. ఇప్పుడు ఇదే పేరుతో ఒక డబ్బింగ్ చిత్రం రానుంది. మలయాళంలో కృష్ణ, ప్రతిష్ట ప్రధాన పాత్రలలో వచ్చిన “రాసలీల” అనే చిత్రాన్ని తెలుగులో “ఆ ఒక్కటే అడక్కు” అనే పేరుతో అనువదిస్తున్నారు. ఆసక్తికరమయిన విషయం ఏంటంటే ఈ చిత్రం కమల్ హసన్ మరియు జయసుధలు ప్రధాన పాత్రలలో వచ్చిన “రాసలీల” చిత్రానికి రీమేక్. మజీద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి రాజేంద్రకుమార్ అనువదిస్తున్నారు.