కమల్ హాసన్ రాబోతున్న చిత్రం “విశ్వరూపం” చిత్రం రెండు వారాల పాటు వాయిదా పడింది. జనవరి 25న రావలసిన ఈ చిత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ చిత్రం మీద కొన్ని ముస్లిం వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేసాయని నిన్న చెప్పాము. ఈ చిత్రం తీవ్రవాదం మీద ఉండటం ఇందులో ముస్లిం వారి మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని వీరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమిళంలో బ్యాన్ అయిన ఈ చిత్రం తెలుగులో విడుదల అవుతుందా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. కమల్ హాసన్ రచించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ – ఎహాసన్ – లాయ్ సంగీతం అందించారు. పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్ ఈ చిత్రంలో కమల్ హసన్ తో పాటుగా ప్రధాన పాత్రలు పోషించారు.