జబర్దస్త్ ఆడియో విడుదలలో మార్పు

Siddharth_Samantha-film
సిద్దార్థ్, సమంత మరియు నిత్య మీనన్ ప్రధాన పాత్రలలో రానున్న రొమాంటిక్ ఫిలిం “జబర్దస్త్”. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్ర ఆడియో జనవరి 27న విడుదల కావలసి ఉంది కాని ఈ విడుదలలో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్ర ఆడియోని నేరుగా మార్కెట్ లో కి విడుదల చేస్తున్నారని సిద్దార్థ్ వెల్లడించారు. అయన ఆరోజు నగరంలో ఉండకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తుంది. అయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రాన్ని ప్రమోషన్ లో పాల్గొనలేక పోతున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సిద్దార్థ్ ముస్లిం యువకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో రానుంది.

Exit mobile version