ఈ ఫిబ్రవరి టాలీవుడ్ కి బిజీ నెల కానుందా?

Tfi
ఈ ఏడాది ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి సందడిగా గడవనుంది. ఈ ఫిబ్రవరిలో నాలుగు పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. అన్నింటికన్నా ముందుగా రామ్ “ఒంగోలు గిత్త” ఫిబ్రవరి 1న రానుంది. ప్రభాస్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రానున్న “మిర్చి” ఫిబ్రవరి 7న విడుదల కానుంది. సిద్దార్థ్,సమంత ప్రధాన పాత్రలలో రానున్న “జబర్దస్త్” ఫిబ్రవరిలోనే రానుంది. ఇవే కాకుండా లక్ష్మి మంచు “గుండెల్లో గోదారి” కూడా ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ “గౌరవం”, “మిస్టర్ పెళ్ళికొడుకు”, “డి ఫర్ దోపిడీ”, “బంగారు కోడిపెట్ట”, “స్వామి రా రా” చిత్రాలు కూడా ఫిబ్రవరిలో రానున్నాయి. ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే మణిరత్నం “కడలి”, ప్రభుదేవా “ABCD”, విక్రం “డేవిడ్” ఫిబ్రవరి విడుదలకు సిద్దమయ్యాయి. గత మూడేళ్లలో ఫిబ్రవరిలో విడుదలయిన చిత్రాలలో ఒకటి లేదా రెండు చిత్రాలు మాత్రమే భారీ విజయాలు నమోదు చేశాయి.చూస్తుంటే ఈ చిత్ర నిర్మాతలు రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇందులో కొన్ని చిత్రాలు మార్చ్ కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒకే నెలలో ఇన్ని చిత్రాలు రావడం సగటు సినిమా అభిమానికి వీనులవిందు కానుంది.

Exit mobile version