మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు సోమవారం వి వి వినాయక్ మరియు “నాయక్” చిత్ర బృందంతో కలిసి తిరుమలను సందర్శించారు. గుడి నుండి బయటకు రాగానే చరణ్ మీడియాతో మాట్లాడారు “నాయక్” చిత్రం విజయానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోడానికి వచ్చాను అని చెప్పారు.
“రచ్చ మరియు “నాయక్” వరుస విజయాల తరువాత ఈ ఏడాది “జంజీర్” మరియు “ఎవడు” వంటి చిత్రాలు విడుదల కానున్నాయి అందులో “జంజీర్” చిత్రం బాలివుడ్లో చరణ్ మొదటి చిత్రం. ఈ చిత్రంలో చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇలానే చరణ్ తన కెరీర్ ని విజయపథంలో నడపాలని కోరుకుందాం.