హీరో హీరోయిన్ యాంకర్స్ గా స్వామీ రారా ఆడియో లాంచ్

Swamiraraa

చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ లోనూ ఎవరో ఒక టీవీ యాంకర్ ని వ్యాఖ్యాతగా పెట్టి కార్యక్రమం జరిపించేస్తుంటారు అది చాలా కామన్ పాయింట్. సినిమాలో నటించిన వారో లేక డైరెక్టరో యాంకర్లుగా వ్యవహరించే ఆడియో ఫంక్షన్ లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి తరుణంలో సినిమాలో నటించిన హీరో హీరోయిన్ యాంకర్స్ గా ఓ ఆడియో వేడుక జరగనుంది. ఇంతకీ అదే సినిమా అనుకుంటున్నారా? యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన ‘స్వామి రారా’ సినిమా ఆడియో వేడుకలో ఈ సంఘటన చోటు చేసుకోనుంది.

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ లో జరగనుంది. ఈ వేడుకలో నిఖిల్, స్వాతి యాంకర్లుగా కార్యక్రమాన్ని జరిపించనున్నారు. ఎప్పుడూ ఆన్ స్క్రీన్ అల్లరి చేసే హీరో హీరోయిన్ ఆడియో వేడుక పై సందడి చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. ఈ క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కి సుదీర్ వర్మ డైరెక్టర్. చక్రి చిగురుపతి నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్ని మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version