పవన్ లుక్స్ పై వైరల్ అవుతున్న మరో గాసిప్!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” పై మేకర్స్ అసలు పనిలో పడ్డారు. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి ఈ సినిమా సెకండ్ సింగిల్ ను ఈరోజు విడుదల చెయ్యడానికి సర్వం సిద్ధం చేసినట్టుగా మేకర్స్ తెలిపారు.

దీనితో మళ్ళీ వకీల్ సాబ్ హవా షురూ అయ్యిపోయింది. అయితే సెకండ్ సింగిల్ గా ప్లాన్ ” సత్యమేవ జయతే”తో పాటుగా మరో టాక్ కూడా వైరల్ అవుతుంది. ఇది వరకే ఈ సినిమాలో పవన్ మొత్తం మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడని విన్నాము. కానీ ఇప్పుడు ఇంకో లుక్ లో కూడా ఉంటాడని టాక్ ఊపందుకుంది.

మరి అదెలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మాణం వహించారు.

Exit mobile version