ఇప్పుడు మన టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా నిలుస్తుంది స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా సక్సెస్ రేట్ మాత్రం ఈ బ్యూటీకి గట్టిగానే ఉంది. ఒకటి రెండు సినిమాలు మినహా మిగతా అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించినవే..
దీనితో మోస్ట్ లక్కీయేస్ట్ హీరోయిన్ గా పేరొందిన ఈమె పేరు సోషల్ మీడియాలో మాత్రం గత మూడు రోజులుగా పెద్దగా ఎలాంటి కారణం లేకుండానే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ వస్తుంది. రోజుకు ఒకసారి అయినా రష్మికా పేరు ట్విట్టర్ ట్రెండ్స్ నిలుస్తుండడం గమనార్హం.
దీనితో ఇదంతా ప్యూర్ రష్మికా క్రేజ్ నే అంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఆ మధ్య కూడా గూగుల్ లోనే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కూడా ప్రకటించబడింది. దీనితోనే రష్మికా క్రేజ్ ఎలా ఉందో అర్ధం అయ్యింది. ప్రస్తుతం రష్మికా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప” అనే పాన్ ఇండియన్ చిత్రంతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తుంది.