సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది, ఈ సినిమాకి రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమాకి టికెట్లు అన్ని ఎరియాల్లోనూ కొన్ని రోజులకి అమ్ముడుపోయాయి. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల రేర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.
మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో బిగ్ హిట్ అయ్యింది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్.