రానా “విరాట పర్వం” రిలీజ్ టైం ఫిక్స్ అయ్యింది.!

టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్టులలో “విరాట పర్వం” చిత్రం కూడా ఒకటి. ఎప్పటి నుంచో తెరకెక్కుస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు మరియు సీనియర్ నటులు కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మరి అలాగే ఈ చిత్రంలో రానా సరసన నాచురల్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మేకర్స్ ఈ ఇద్దరి మధ్య డిజైన్ చేసిన ఓ పోస్టర్ ను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. అంతే కాకుండా “విప్లవం అనేది ప్రేమ వల్ల కలిగే ఒక చర్య” అనే లైన్ కూడా పెట్టారు.

అంటే ఈ ఇద్దరి మధ్య మంచి ట్రాక్ ఉండేలా అనిపిస్తుంది. ఇక పోతే రానా ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు చాలా కొత్త కంటెంట్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా పాత్రలు ఉంటాయని చెప్తున్నారు.

మరి అలాగే ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఎస్ వి సినిమాస్ వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version