ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పటి నుంచో టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మామూలు అప్డేట్ అయితే చెప్పారు కానీ ఇంకా వస్తుంది అన్నది మాత్రం కన్ఫర్మ్ చెయ్యలేదు.
మరి దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ అంశం అలా సస్పెన్స్ గానే మిగిలిపోయింది. కానీ ఈ సంక్రాంతి కానుకగానే వస్తుంది అని అంతా అన్నా ఇంకా ఒకరోజు సమయమే మిగిలి ఉన్నప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి చలనమూ లేదు. దీనితో అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో అన్నది యూవీ మేకర్స్ వారు రివీల్ చేస్తే బాగున్ను. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వర్రీగా ఉన్నారు. మరి ఆ టీజర్ ఏదో వదిలేస్తే దానికి భారీ రికార్డులు సెట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.