రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ విశేషాలు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన అనేక హిట్ సినిమాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ టైమ్ కేటాయించేస్తుంటారు. 1996లో వచ్చిన ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా చేయడం జరిగింది. ఈ సినిమా విడుదలై నేటికీ 25 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇప్పుడు అదే రాఘవేంద్రరావుగారు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమా చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా ఆయన వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసిన గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉందని, త్వరలోనే థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు దర్శకేంద్రుడు. ఇందులో రోషన్ సరసన శ్రీలీల కథానాయకిగా నటిస్తోంది. పాతికేళ్ల క్రితం చేసిన సినిమాను ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టు ఎలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారో అనేది ప్రేక్షకులకు ఆసక్తికని రేకెత్తిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి నిర్మిస్తున్నారు.

Exit mobile version