గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే కోవిడ్ 19కు గురైన సంగతి తెలిసిందే. పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ తీసుకుని వైద్యుల సలహాలు పాటించిన చరణ్ ఎట్టకేలకు కరోనాను జయించారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకు కరోనా నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న చరణ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటానని తెలిపారు. అలాగే తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

చరణ్ కు కరోనా అని తెలియగానే ఆందోళనపడిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈరోజు ఆయనకు నెగెటివ్ అని తెలియడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ చెర్రీకి అభినందనలు తెలుపుతున్నారు. చరణ్ కోలుకోవడంతో ‘ఆర్ఆర్ఆర్, ఆచార్య’ చిత్రీకరణలు కూడ వేగం అందుకోనున్నాయి.

Exit mobile version