ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలో జాంబీ కాన్సెప్ట్ పై చాలానే సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి. కానీ మన ఇండియన్ స్క్రీన్ నుంచి మాతరం ఇప్పటి వరకు ఆ తరహా సినిమాలు రాలేదు. కానీ అలాంటి రేర్ కాన్సెప్ట్ తో మన తెలుగు నుంచే టేకప్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “జాంబీ రెడ్డి”.
తన మొదటి చిత్రం “అ!”తోనే సత్తా చాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్టర్స్ అండ్ టీజర్ లతో మంచి హైప్ ను సెట్ చేసుకుంది. కరోనా మరియు జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఫిబ్రవరి 5న గ్రాండ్ రిలీజ్ కు ఫిక్స్ చేశారు.
ఆనంది, దక్ష నగర్కర్ ఫిమేల్ లీడ్స్ లో నటించిన ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మరి ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.