మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సాలిడ్ కం బ్యాక్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”. భారీ అంచనాలు నడుమ సంక్రాంతి కానుకగా ఈ జనవరి 9న విడుదలకు రెడీ అయిన ఈ చిత్రం ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొందో తెలిసిందే. అయినప్పటికీ చివరి రెండు ఆటలతో మొదలైనా మాస్ మహారాజ్ హిట్ రీసౌండ్ గట్టిగానే వినిపించింది.
ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయే ఓపెనింగ్స్ ను మాస్ మహారాజ్ కొల్లగొట్టేసాడు. అలా ప్రతీ ఏరియాలో కూడా మంచి వసూళ్లను అందుకుంటున్న ఈ చిత్రం కృష్ణ జిల్లా తాలూకా వసూళ్లు వివరాలు తెలుస్తుంది. ఈ 50 శాతం ఆక్యుపెన్సీ తోనే క్రాక్ మూడో రోజుల్లో 66.36 లక్షల షేర్ 1.23 కోట్ల గ్రాస్ ను అందుకొంది.
అలాగే మూడోరోజు 33.22 లక్షలు వసూళ్లు చేసింది. మొత్తానికి మాత్రం “క్రాక్” సూపర్ సాలిడ్ గా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా నిలబడింది అని చెప్పాలి.మొత్తానికి గోపీచంద్ మలినేని మరియు రవితేజల కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం స్యూర్ షాట్ హ్యాట్రిక్ గా నిలిచింది అని చెప్పాలి.