“సలార్”కు అంతా సిద్ధం అవుతుందా.?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. మరి అలాగే దీని ప్రకటన తోనే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం మొన్న వచ్చిన “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పుకుంది. మరి ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

మళ్ళీ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ఓసారి మీట్ అవ్వనున్నారని తెలుస్తుంది. ఒక్కసారి మళ్ళీ మొత్తం మాట్లాడుకొని షూట్ కు అన్నీ రెడీ చేసేసి ఎప్పటి నుంచి షూట్ స్టార్ట్ చెయ్యాలి అన్నది ఫైనలైజ్ చేస్తున్నారట. ఇప్పటికే వచ్చే జనవరి 22 నుంచే ఈ చిత్రం షూట్ స్టార్ట్ కానుంది అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అప్పటి నుంచే ఈ భారీ సినిమాను అక్కడ నుంచే మొదలు పెట్టనున్నట్టే తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో చూడాలి.

Exit mobile version