ఇది రవితేజ వసూళ్ల జాతర


మాస్ మహారాజ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం థియేటర్లలో సత్తా చూపిస్తోంది. లాక్ డౌన్ అనంతరం వచ్చిన పెద్ద చిత్రం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. తొలిరోజు కొన్ని అనివార్య కారణాల వలన మొదటి రెండు షోలు రద్దయినప్పటికీ ఫస్ట్ షో నుండి సినిమా పడింది. మొదటి రెండు షోలు క్యాన్సిల్ కావడంతో అసహనానికి గురైనప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు శాంతించి సినిమాను ఆదరించారు. దీంతో సినిమాకు వసూళ్లు బాగానే వచ్చాయి.

9వ తేదీ రాత్రి షోలతో కలుపుకుని ఆదివారం నాటికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక షేర్ 6.25 కోట్లుగా ఉంది. ఏరియల్ వారీగా వసూళ్లను చూస్తే నైజాంలో 2.28 కోట్లు, సీడెడ్లో కోటి, ఉత్తరాంధ్రలో 85 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో 28 లక్షలు, గుంటూరులో 65 లక్షలు, కృష్ణాలో 45 లక్షలు, నెల్లూరులో 26 లక్షలు వసూలు చేసింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రవితేజకు మంచి కమ్ బ్యాక్ అవడమే కాదు నీరసించిన టాలీవుడ్ పరిశ్రమకు సాలిడ్ పుష్ ఇచ్చింది కూడ.

Exit mobile version