‘ప్రభాస్ – నాగ్ అశ్విన్’ సినిమా సమ్మర్ నుండి ?

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్ళదని, విదేశాల నుండి అంతర్జాతీయ సాంకేతిక బృందం పని చేయాల్సి రావడం, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబందించి కూడా విదేశాల్లోనే చేయాల్సి రావడంతో ఈ సినిమాని 2022లో షూటింగ్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కాగా సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసినా.. షూటింగ్ మాత్రం సమ్మర్ నుండి ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన సెట్స్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక సీక్వెన్స్ ను ముందుగా తీయాలని చూస్తున్నారట. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్.

Exit mobile version