‘గుర్తుందా శీతాకాలం’ సెట్ లో తమన్నా !

సత్యదేవ్, తమన్నా కలిసి నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతుంది. అయితే ఈ రోజు హీరోయిన్ తమన్నా ఈ సినిమా షూట్ లో పాల్గినడానికి బెంగళూరు వెళ్ళింది. షూట్ లో కూడా పాల్గొంది. మరో వారం రోజుల పాటు షూటింగ్ జరగనుంది. నాగ శేఖర్ దర్శకత్వంలో సత్య దేవ్ మరియు తమన్నా కలిసి నటిస్తుండం అనేది ఈ చిత్రానికి బిగ్ ఎస్సేట్ గా మారింది.

కాగా కన్నడలో సూపర్ హిట్టైన లవ్ మాక్ టైల్ సినిమా తెలుగు రీమేక్ కాబోతుంది. కృష్ణ దర్శక నిర్మాతగా అతనే హీరోగా నటించిన సినిమా లవ్ మాక్ టైల్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అక్కడ సూపర్ హిట్టైన ఈ సినిమాని తెలుగులో నాగ శేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తన సత్తా చాటిన సత్యదేవ్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపిస్తాడేమో చూడాలి.

Exit mobile version