ప్రభాస్ “రాధేశ్యామ్” అప్పటికి అయ్యిపోతుందా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా వస్తుంది.

పాన్ ఇండియన్ లెవెల్లో మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి టీజర్ కోసమే అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పటికి పూర్తి కానుందో అన్నది తెలుస్తుంది.

ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ ఈ జనవరి మూడవ వారానికల్లా లేదా అంతకు ముందే పూర్తి చేసేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం అనంతరం ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఆసక్తికర సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ కు సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఈ 14కు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

Exit mobile version