మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవలే పూర్తయ్యింది. షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పలువురు కంటెస్టెంట్స్ మంచి బిజీగా కూడా ఉన్నారు. కానీ ఓ టాప్ మోస్ట్ కంటెస్టెంట్ పరిస్థితే ఇప్పుడు ఎలా ఉందో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఒక స్టేజ్ లో గట్టి ఫాలోయింగ్ ను సంతరించుకొని టైటిల్ విన్నింగ్ అయ్యే అవకాశాలు గట్టిగా తెచ్చుకున్నాడు అఖిల్. కానీ ఊహించని విధంగా తర్వాత మెల్లగా అతడి గ్రాఫ్ కొద్ది కొద్దిగా పడిపోయింది.
దానితో జస్ట్ రన్నర్ గా మాత్రమే నిలిచాడు. కానీ అక్కడ నుంచి పెద్దగా అతడు బయట ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అంతే కాకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చిన జాడ కూడా కనిపించలేదు. అసలు హౌస్ లో అతనితో కనెక్ట్ అయ్యి ఉన్న వారంతా బయటకొచ్చాక ఫుల్ బిజీగా అయ్యిపోయారు. కానీ అఖిల్ ను మాత్రం పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. పైగా ఆఫర్స్ కూడా పెద్దగా వచ్చిన రెస్పాన్స్ లేదు. మరి అఖిల్ కు మంచి బ్రేక్ వస్తుందా లేదా అన్నది చూడాలి.