బిగ్ బాస్ 4 – ఏది ఏమైనా ఫినాలే క్రెడిట్ ఈ ముగ్గురిదే..!

ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా క్లియర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సారి సీజన్ 4 కు భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. అలాగే లేటెస్ట్ గా ఫినాలే ఎపిసోడ్ కు కనీ వినీ ఎరుగని రీతి టీఆర్పీ వచ్చింది. 19.51 రేటింగ్ తో ఇండియా లోనే హై యెస్ట్ గా నిలిచింది. మరి ఇక్కడే బిగ్ బాస్ ఆడియెన్స్ నడుమ క్రెడిట్ టాక్ మొదలయ్యింది.

ఇది ఎప్పుడు ఉండేదే అని తెలిసిందే. ఒక్కొక్కరూ తాము అభిమానించే వారికే క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ నాగార్జున ఫినాలే కు వచ్చిన అభిజీత్ లు ముగ్గురూ కారణమే. ఎందుకంటే అభిజీత్ ఎలాగో ఈసారి సీజన్ ను వార్ వన్ సైడ్ చేసేసాడు అయినా విన్నర్ అతనా కాదా అన్న ఉత్సుకత..

కింగ్ నాగార్జున ఆల్ టైం అదిరిపోయే హోస్టింగ్ లు అదరగొట్టగా గతంలో కూడా మెగాస్టార్ వచ్చినప్పుడు పర్టిక్యులర్ గా ఆ లాస్ట్ గంట అత్యధిక రేటింగ్ నమోదు అయ్యింది. మరి అదే మ్యాజిక్ ఈసారి కూడా రిపీట్ అయ్యింది. సో ఈసారి ఈ స్థాయి రేటింగ్ రావడానికి వీరు ముగ్గురూ ప్రధాన కారణమే అని చెప్పాలి.

Exit mobile version