“ఖిలాడి”కు మరింత ఎనర్జిటిక్ గా మాస్ మహారాజ్.!

మన టాలీవుడ్ లో ఎనర్జీకు కేరాఫ్ అడ్రెస్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ మహారాజ్ రవితేజ అని చెప్పాలి. తన కో స్టార్స్ ఎందరో ఆ విషయాన్ని చెప్పారు. మరి అందుకు తగ్గట్టుగానే మాస్ మహారాజ్ రవితేజ తన లేటెస్ట్ చిత్రం “క్రాక్”ను శరవేగంగా పూర్తి చేసేసారు. ఇక ఇది లైన్ లోన్ ఉండగానే మరో సాలిడ్ యాక్షన్ డ్రామా “ఖిలాడి” చిత్రాన్ని లైన్ లో పెట్టేసారు.

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ఒక సాలిడ్ యాక్షన్ సన్నివేశాన్ని కేజీయఫ్ ఫైట్ మాస్టర్స్ సమక్షంలో జరిగింది. మరి అలాగే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే రెండు నెలలు పూర్తి అయ్యే సరికి 50 శాతం మేర రవితేజ కంప్లీట్ చేసేస్తారని తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ షూట్ లో సీనియర్ నటుడు శరత్ కుమార్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సినిమాను కూడా రవితేజ తనదైన ఎనర్జీతో సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసెయ్యడం ఖాయం చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ మూవీస్ ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version