రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. సినిమాలోనే ఆయనది కీలక పాత్ర అని.. ఇక సినిమాలో బ్రేక్ పాయింట్ అయిన ప్రీ కైమాక్స్ లో అజయ్ పాత్ర చనిపోతుందని.. మొత్తంగా హీరోల పాత్రల పై అజయ్ పాత్ర భారీ ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది.
కాగా అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే సినిమాలో కనిపిస్తారట. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్ సన్ ను, అలాగే ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.