‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కమెడియన్ సునీల్ నటించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన మిత్రుడు డైరెక్టర్ తివిక్రమ్ చొరవతో ఎన్టీఆర్ కొత్త సినిమాలో సునీల్ కి విలన్ గా అవకాశం వచ్చిందట. మరి సునీల్ విలన్ గా నిజంగానే నటిస్తున్నాడా లేడా అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా 2021 దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.