క్లారిటీ కోరుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ !

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ‘ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్’ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ప్రశాంత్ నీల్ – ప్రభాస్ మూవీ ప్రకటించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు మేకర్స్. కెజిఎఫ్ నిర్మాతలు హోమబుల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దీనితో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందా లేదా అనే సందేహం ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైంది.

దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ అయినా ఈ ప్రాజెక్ట్ గురించి వివరణ ఇస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ను పూర్తి చేసి ప్రశాంత్ ప్రభాస్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Exit mobile version