ప్రభుదేవా రహస్య వివాహం నిజమేనా ?


ప్రముఖ కొరియోగ్రఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రెండో వివాహం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆయన తన బంధు వర్గంలోని ఇక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని అనుకుంటుండగా ఇప్పుడు ఏకంగా రహస్య వివాహమే చేసుకున్నారని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ప్రభుదేవా వెన్నెనొప్పి సమస్య కారణంగా ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నారు. ఆ టైంలోనే ఆయన ఒక ఫిజియోథెరపిస్ట్ తో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు ఆమెనే ముంబైలోని తన ఫ్లాట్లో పెళ్లాడారని, ప్రస్తుతం ఇద్దరూ చెన్నైలో ఉంటున్నారని వార్తలొస్తున్నాయి.

పెళ్లి సెప్టెంబర్లోనే జరిగిపోయిందట. ఆమ్మాయి బీహార్ రాష్ట్రానికి చెందిన అమ్మాయట. ప్రభుదేవా సన్నిహితుల్లో ఒకరు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారట. అయితే ప్రభుదేవా ఈ వార్తలపై స్పందించాల్సి ఉంది. మొదటి భార్య రామలతతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ప్రభుదేవా ఆ తర్వాత ఒక దక్షిణాది స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారు. చాలారోజులు నడిచిన వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే బ్రేక్ అయింది. ఆ బ్రేకప్ తర్వాత ప్రభుదేవా పూర్తిగా దర్శకత్వం మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ చిత్రాన్ని చేస్తున్నారు.

Exit mobile version