ప్రస్తుతం యూయూన్గ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు 10 ఎప్పుడు అవుతుందా అని గడియారం వంక అలా చూస్తూనే ఉన్నారు. వారు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల చిత్రం నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ రివీల్ అవ్వనుంది. నాగశ్విన్ కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను నిరాశ పరచకుండా ఏదొక సమాచారాన్ని అందిస్తున్నారు.
అలా ఇపుడు చెప్పిన క్రాకింగ్ అప్డేట్ కోసం వారు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అప్డేట్ ఏమయ్యి ఉంటుందా అని ప్రభాస్ మరియు అన్ని ఇండస్ట్రీ వర్గాలు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఈ అంశం పట్ల చాలానే స్పెక్యులేషన్స్ తిరుగుతున్నాయి. కానీ ఇపుడు వినిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ప్రకారం..
ప్రభాస్ అండ్ నాగశ్విన్ యూనిట్ ఈ భారీ స్కై ఫై థ్రిల్లర్ తాలూకా టైటిల్ ను రివీల్ చేస్తారని తెలుస్తుంది. మరి ఇదే కాకుండా నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక సాలిడ్ అప్డేట్ దొరికినట్టే..దాదాపు 500 కోట్లకు పైగా వెచ్చించి ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కు వీరు ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారో అన్నది ఎప్పటి నుంచో ఆసక్తికరంగా మారిన అంశం. మరి ఇపుడు రివీల్ చేసేది అదేనా కాదా అన్నది చూడాలి.