రవితేజ ప్లాప్ కు ఈ రేంజ్ రెస్పాన్సా..!

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లూ ఉన్నాయి అదే విధంగా పరాభవాలు ఉన్నాయి. అయితే రవితేజకు బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి హిట్ ను అయితే అందుకున్నారో అంతే స్థాయి డౌన్ అయ్యినవి పడ్డాయి. అలా రవితేజ మళ్ళీ హిట్స్ కోసం స్వింగ్ లో ఉన్న సమయంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చి విఫలం అయిన చిత్రం “నేల టిక్కెట్”.

హిట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. కానీ ఇదే ప్లాప్ సినిమాను హిందీ డబ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తే దానికి ఊహించని రీతి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఏకంగా 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సెట్ చేసింది.

బహుశా ఇదే రవితేజ కెరీర్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన చిత్రం ఇదే కావచ్చు. మన దగ్గర ప్లాప్ సినిమాలకు యూట్యూబ్ లో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే మొదటి సారి కాదు. చాలా చిత్రాలే ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం మాస్ మహారాజ్ మంచి సాలిడ్ కం బ్యాక్ అందుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version