“కేజీయఫ్ చాప్టర్ 2” అంతిమ పోరుకు రెడీ అయ్యింది.!

మన దక్షిణాది నుంచి రానున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనికి ముందు వచ్చిన చాప్టర్ 1 విడుదల కాబడిన అన్ని చిత్రాల్లో కూడా భారీ హిట్ కావడంతో దీనిపై మరింత స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇపుడు ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ఇటీవలే ఈ చిత్రం లాక్ డౌన్ లోనే షూట్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడితో కొంత పార్ట్ పూర్తి కాబడిన ఈ చిత్రం ఫైనల్ షూట్ కు ఇపుడు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారంలోనే మొదలు కానుంది అని టాక్. ఈ షూట్ ను హైదరాబాద్, బెంగళూరు మరియు మెంగళూర్ ప్రాంతాల్లో షూట్ ను జరుపుకోనున్నాయి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం విడుదల ఎప్పుడు అవుతుందో చూడాలి.

Exit mobile version