స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఇంకో మూడు నెలలు అయ్యిపోతే ఈ సినిమా వచ్చి ఏడాది అయ్యిపోతుంది. అయినప్పటికీ ఈ సినిమా సెన్సేషన్ మాత్రం ఇంకా అలా ఓ వేవ్ లా కొనసాగుతూనే ఉంది. ఏ అంశంలో కూడా ఏ ఒక్క రికార్డును వదిలిపెట్టని ఈ చిత్రం ఇప్పుడు మరో సెన్సేషనల్ మైల్ స్టోన్ ను టచ్ చేసింది.
ఈ సినిమా విజయానికి ఎస్ ఎస్ థమన్ అందించిన ఎంతో కీలక పాత్ర వహించిన మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పుడు ఏకంగా 1.5 బిలియన్ స్ట్రీమింగ్స్ ను ఒక్క యూట్యూబ్ నుంచే అందుకొని మన సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచింది. దీనితో ఇలాంటి అరుదైన రికార్డు కలిగిన ఏకైక తెలుగు మరియు మన దక్షిణ చిత్ర పరిశ్రమలో హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. మరి స్టైలిష్ స్టార్ వేట ఇంకెక్కడ ఆగుతుందో చూడాలి.