చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందే…!

నిన్న రామ్ చరణ్ చాలా కాలం తరువాత దర్శనం ఇచ్చారు. జానీ మాస్టర్ పుట్టినరోజు సంధర్భంగా విషెష్ చెవుతూ ఆయన ఓ ప్రత్యేక వీడియో చేయగా అందులో చరణ్ బాగా పెరిగిన జుట్టు గడ్డంలో ఉన్నారు. ఆ వీడియోలో షూటింగ్స్ లేకపోవడం ఆయన్ని బాగా ఇబ్బందిపెడుతుందన్న భావన వ్యక్త పరిచాడు. త్వరలోనే నార్మల్ పరిస్థితులు ఏర్పడాలి, షూటింగ్స్ సందడి మొదలవ్వాలని చరణ్ కోరుకున్నారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ రామరాజు పాత్ర చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామరాజుగా ఆయన ఫస్ట్ లుక్ వీడియో కూడా బయటికి రాగా అందులో చరణ్ కోరమీసం నీట్ షేవ్ లో కనిపించారు. ఐతే తాజా వీడియోలో చరణ్ దానికి భిన్నంగా కనిపించారు. షూటింగ్స్ లేకపోవడం వలనే ఆయన ఇలా తయారైనట్లు తెలుస్తుంది.

Exit mobile version