రానా నిర్మించిన మూవీపై కేసు నమోదు.

సిద్దూ జొన్నలగడ్డ, శ్ర ద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి హీరో హీరోయిన్లుగా దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటరైనర్ కృష్ణ అండ్ హిజ్ లీల. ఈనెల 25న ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రంపై ఓ వివాదం రేగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలోని హీరో హీరోయిన్ల పేర్లపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. ఈ చిత్రంలో హీరో పేరు కృష్ణ కాగా, హీరోయిన్ల పాత్రలకు సత్య, రాధా అనే పేర్లు పెట్టడం జరిగింది. ఓ రొమాంటిక్ లవ్ డ్రామాలో పాత్రలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం పై ఆయన అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్ర నిర్మాత రానా కావడం విశేషం.

Exit mobile version