మహేష్ మూవీపై క్రేజీ అప్డేట్..!

ఫ్యాన్స్ ని కొంచం వెయిట్ చేయించినా…ఆయన ప్రకటించిన సర్కారు వారి పాట చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ దక్కింది. ముఖ్యంగా మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాగా ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కానుందని సమాచారం. కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ బ్యాంకు సెట్ వేయించే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట. ఓ ప్రముఖ స్టూడియోలో ఓ భారీ బ్యాంకు సెట్ నిర్మించనున్నారట.

బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో లో ఈ మూవీ తెరకెక్కనున్న నేపథ్యంలో బ్యాంకు సెట్ వేయించనున్నారని సమాచారం. ఈ మూవీ లో మహేష్ పాత్ర సరికొత్తగా ఉండడం ఖాయం అన్న మాట వినిపిస్తుంది. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version