వైరల్ అవుతున్న స్టార్ హీరో ఒరిజినల్ లుక్


బాలీవుడ్ ఖాన్ త్రయంలో అమిర్ ఖాన్ ది ప్రత్యేక శైలి. మూస కథలకు దూరంగా విభిన్నమైన సబ్జక్ట్స్ ఎంచుకొని బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆయన నటించిన త్రీ ఇడియట్స్, పీకె, దంగల్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. కాగా ఈ స్టార్ హీరో ఒరిజినల్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెల్లని షార్ట్ హెయిర్, నీట్ షేవ్, గ్లాసెస్ పెట్టుకొని ఉన్న అమీర్ ఖాన్ భిన్నంగా ఉన్నాడు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్నాడు . ఇందులో అమీర్ సిక్కు యువకుడిగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో అమీర్ జవానుగా పాత్ర చేస్తున్నారు. హాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే మూవీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు.

Exit mobile version