ఎటో వెళిపోయింది మనసులో ఆ సీన్ సెన్సార్ చేసారా?


నాని మరియు సమంతలు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు”. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ మధ్యనే తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర స్టిల్ ఒకటి ఇంటర్నెట్లో చిత్రంలో నాని మరియు సమంతల మధ్య ముద్దు సన్నివేశం ఉన్నట్లు పుకార్లు సృష్టించింది. కాని తమిళంలో ఈ చిత్రం “U” సర్టిఫికేట్ అందుకోడంతో ఈ సన్నివేశాన్ని తొలగించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద సమంత వివరణ ఇస్తూ ఈ చిత్రంలో ఎటువంటి ముద్దు సన్నివేశాలు లేవని ఎటువంటి కట్ లు లేకుండా “U” సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఈ విషయం అర్ధం అయ్యుంటుంది అని అన్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ ని సి కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చెయ్యనున్నారు.

సమంత ప్రస్తుతం పూణేలొ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో ఒక పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ డిసెంబర్ 20న పూర్తి చేసుకోనుంది. దీంతో ఆమె అన్ని చిత్రాల చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టే. 2013లో ఆమె పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల చిత్రం మరియు ఎన్టీఆర్-హరీష్ శంకర్ ల చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటుంది.

Exit mobile version