మణిరత్నం ఎట్టకేలకు అయన రాబోతున్న చిత్రం “కడల్” చిత్ర ఆడియో విడుదల తేదీ ప్రకటించారు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ మధ్యనే గౌతం ఉన్న ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు ఈ ఫస్ట్ లుక్ కి అశేష స్పందన కనపడింది. రాధా చిన్న కూతురు తులసి ఈ చిత్రంలో గౌతం సరసన నటిస్తుంది జాలర్ల నేపధ్యంలో సాగే టీనేజ్ ప్రేమ కథ ఇది. లక్ష్మి మంచు మరియు అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత నెల ఈ చిత్రంలోని “నెంజికుల్లె” అనే పాటను ఏ ఆర్ రెహమాన్ MTV లో విడుదల చేశారు. అలానే డిసెంబర్ 10న “ఏలే కీచన్” అనే పాటను విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రాన్ని మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.